వి. చిత్తూరి నాగయ్య
డిసెంబర్ 30 న నాగయ్య గారి వర్థంతి సందర్భంగా......!!!!!!!
ప్రముఖ చలన చిత్ర నటులు, దర్శకులు శ్రీ వుప్పలదడియం చిత్తూరి నాగయ్య గారు మార్చి 28 1904 న గుంటూరు జిల్లా రేపల్లె లో ఒక సద్బ్రాహ్మణ కుటుంబము లో రామలింగ శర్మ మరియు వెంకట లక్ష్మాంబ అను పుణ్యదంపతులకు జన్మించారు. తిరుపతి దేవస్థానం అందించిన స్కాలర్ షిప్ సహాయంతో చిత్తూరు లో డిగ్రీ పొందారు. మొదటగా గవర్నమెంట్ ఆఫీసులో చిన్న క్లర్క్ గా పనిచేసిన నాగయ్య గారు, ఆ తరువాత "ఆంధ్ర పత్రిక" జర్నలిస్టుగా కొద్దికాలం పనిచేసారు.
చిన్నతనం నుంచే నాటకాల పట్ల ఆకర్షితుడైన నాగయ్య గారు సారంగధర, విశ్వామిత్ర, చిత్రనళీయం, సావిత్రి, బృహన్నల, రామదాసు తదితర నాటకాల లో ప్రధాన భూమిక పోషిస్తూ పలు బహుమానాలు, సన్మానాలు అందుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు .
ప్రప్రధమంగా "గృహలక్ష్మి" అనే చిత్రం లో నటించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. అ చిత్రం లో ని "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్ బాబూ" పాట శ్రీ నాగయ్యకు విశేష కీర్తి ని తెచ్చిపెట్టింది .
నటుడిగా తెలుగు, తమిళ మరియు కన్నడ చిత్రాల్లో ఎన్నో పాత్రలతో జనాల్ని మెప్పించిన నాగయ్యగారు త్యాగయ్య, రామదాసు, నా ఇల్లు సినిమాలకు దర్శకత్వం వహించారు. త్యాగయ్య చిత్రనిర్మాణం చేపట్టి ఆయనే స్వయంగా ఆ చిత్ర దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించి నేపధ్య గాయకుడిగా, త్యాగయ్య గా కూడా నటించి - తన బహుముఖ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. అయితే త్యాగయ్య చిత్రం నాగయ్య గారికి ఆర్థికంగా ఏమి లాభం చేకూర్చలేదు. అలాగే ఆయన స్వయంగా నిర్మించిన రామదాసు చిత్రం ఎనలేని కీర్తి ని తెచ్చిపెట్టింది .
నాటి కొద్దిమంది, నేటి ఎంతోమంది దర్శకులలాగా జనాల్ని "మురిపించని,మరిపించని " నాగయ్యగారి దర్శకత్వం, చిత్ర నిర్మాణ విధానం.., కమర్షియల్ చేయటం కోసం, ప్రేక్షకులని ఆకర్షించటం కోసం యదార్ధాన్ని తప్పుదోవపట్టించని నిజాయితీ, పని లో ఖచ్చితత్త్వం మాటలో మృదుత్వం నాగయ్య గారికి ఎన్నో కీర్తిప్రతిష్టలు, అవార్డులని తెచిపెట్టాయి, ఆర్ధిక నష్టాన్ని కల్గించాయి. రామదాసు, త్యాగయ్య చిత్రాలు ఆర్థికంగా బాగా నష్టం కలిగించాయని చిత్ర నిర్మాణ పరిశీలకులు పేర్కొంటారు.
శ్రీ నాగయ్య గారు 72 ఏళ్ళు జీవిస్తే, అందులో సుమారు ఐదు దశాబ్దాలు నాటక, సంగీత, సినీ చిత్ర రంగాలకే అంకితం చేశారు. మైసూరు, తిరువాన్కూరు రాజుల సన్మానం, కేంద్ర ప్రభుత్వం నుండి "పద్మశ్రీ" బిరుదు అందుకున్నారు. తను సంపాదించిన దానిలో ఎక్కువభాగం దాన ధర్మాలకే వెచ్చించిన ఆదర్శ తెలుగు చలన చిత్ర నటులు, త్యాగశీలి, నిరాడంబరుడైన శ్రీ నాగయ్య గారు 1973 డిసెంబరు 30 న మద్రాసులో మరణించారు.


This comment has been removed by the author.
ReplyDeleteNagaiah always used to salute every traffic constable while traveling in car and he felt it as an accolade he is offering to them who stands under the sun only to help and guide the people.
ReplyDeleteHe had no children of his own yet he was called as ‘Naannagaaru’ (dear father) by most of the people in film industry as he treated everybody as his own children.
ReplyDeleteGOOD work ra anaya ........
ReplyDeleteKeep going.....
Nice points thambi..!!! keep on posting,
ReplyDeleteall the best my dear frnd i like ur working keep working like this i am happy to say ur my friend
ReplyDelete& i wish u all the best
vamsi nice work ra
ReplyDelete